మీరు భూమి కొనే ముందు తప్పనిసరిగా తెలుసుకోవలిసిన విషయాలు 2026 – పూర్తి వివరణ

మీరు గాని మీ కుటుంబ సభ్యులు గాని భూమి కొనాలి అనుకుంటున్నారా ? అయితే తెప్పనిసరిగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది - పూర్తి వివరాలు చదవండి

📅 27 Jul 2026 ⏱ 2 నిమిషాలు

AP లో భూమి కొనడం పెద్ద నిర్ణయం — లక్షల రూపాయలు పెట్టుబడి పెడతాం. కానీ సరైన verification చేయకుండా కొంటే భవిష్యత్తులో court cases, financial నష్టం రావచ్చు. ఈ గైడ్ లో భూమి కొనే ముందు తప్పనిసరిగా చేయాల్సిన 7 ముఖ్యమైన checks step-by-step వివరిస్తాను. ఇవి online గా ఇంట్లో నుండే చేయవచ్చు.

Check 1 — 1B Record లో పేరు Verify చేయండి

భూమి అమ్మేవారి పేరు మీభూమి లో 1B Record లో ఉందో లేదో verify చేయడం మొదటి మరియు అత్యంత ముఖ్యమైన step.

  • meebhoomi.ap.gov.in లో మీ 1-బి తెరవండి
  • అమ్మేవారు చెప్పిన Survey Number లేదా Khata Number enter చేయండి
  • 1B Record లో కనిపించే పేరు మరియు అమ్మేవారి ఆధార్ కార్డు పేరు compare చేయండి
  • రెండూ match అవ్వాలి — తేడా ఉంటే Mutation pending అయి ఉండవచ్చు

జాగ్రత్త: 1B Record లో పేరు లేని వ్యక్తి అమ్మే హక్కు లేదు.

Check 2 — Encumbrance Certificate (EC) తీసుకోండి

EC అనేది భూమిపై ఏమైనా అప్పులు, court cases లేదా mortgage ఉందో లేదో చూసే document. ఇది IGRS AP (igrs.ap.gov.in) లో ఉచితంగా చూడవచ్చు.

  • IGRS AP తెరచి EC option నొక్కండి
  • District, Mandal, Village మరియు Survey Number enter చేయండి
  • కనీసం 30 సంవత్సరాల EC తీసుకోండి
  • EC లో Bank Mortgage లేదా Court Attachment ఉంటే — ఆ భూమి కొనవద్దు

Check 3 — గ్రామ భూమి వివాద జాబితా చూడండి

మీభూమి లో Village Land Dispute Table లో court cases మరియు revenue disputes లో ఉన్న survey numbers జాబితా ఉంటుంది.

  • మీభూమి లో Village Land Disputes section తెరవండి
  • మీరు కొనాలనుకుంటున్న Survey Number ఈ జాబితాలో ఉందో check చేయండి
  • జాబితాలో ఉంటే — ఆ భూమి కొనవద్దు లేదా advocate సలహా తీసుకోండి

Check 4 — అడంగల్ లో సాగుదారు పేరు చూడండి

అడంగల్ లో Pattadar (యజమాని) మరియు Cultivator (సాగుదారు) వేర్వేరు వ్యక్తుల పేర్లు ఉంటే — tenant farming situation అని అర్థం.

  • mebhoomi.ap.gov.in లో అడంగల్ తెరవండి
  • Pattadar మరియు Cultivator columns చూడండి
  • వేర్వేరు పేర్లు ఉంటే — tenant rights గురించి అమ్మేవారిని అడగండి
  • Tenant రైతులు ఉంటే — వారి consent లేకుండా land transfer కష్టమవుతుంది

Check 5 — FMB Map తో Physical సరిహద్దులు Verify చేయండి

Documents లో చూపించిన భూమి మరియు actual ground లో ఉన్న భూమి match అవ్వాలి.

  • mebhoomi.ap.gov.in లో FMB Map download చేయండి
  • Map తో physically field కి వెళ్ళి సరిహద్దులు confirm చేయండి
  • Documents లో ఉన్న విస్తీర్ణం మరియు actual విస్తీర్ణం match అవ్వాలి
  • తేడా ఉంటే — survey dispute అయి ఉండవచ్చు

Check 6 — Government Market Value చూడండి

IGRS AP లో government నిర్ణయించిన Market Value (guideline value) చూడండి.

  • igrs.ap.gov.in → Market Value Assistance తెరవండి
  • మీ District, Mandal, Village, Land Type select చేయండి
  • Government rate confirm చేయండి
  • Market Value కంటే చాలా తక్కువకు అమ్ముతున్నారంటే — suspicious situation
  • Market Value పై stamp duty calculate చేసి budget plan చేయండి

Check 7 — Pattadar Passbook అడగండి

రిజిస్ట్రేషన్ కి ముందు అమ్మేవారి original Pattadar Passbook చూపించమని అడగండి.

  • Physical Passbook లేదా E-Passbook చూపించమని అడగండి
  • Passbook లో Survey Number, విస్తీర్ణం 1B Record తో match అవ్వాలి
  • Passbook చూపించడానికి reluctant గా ఉంటే — red flag
  • Experienced advocate తో proceed చేయండి

Bonus — Transaction History Check చేయండి

మీభూమి లో 1B section లో Transaction History చూసి ఆ భూమి గతంలో ఎన్నిసార్లు transfer అయిందో, ఎవరి పేరిట ఉందో చెక్ చేయండి. Short period లో చాలాసార్లు transfer అయినట్టు కనిపిస్తే — suspicious situation.

తరచూ అడిగే ప్రశ్నలు

Online checks (1B, అడంగల్, Dispute Table) — 30 నిమిషాలు. EC download — 1 రోజు. Physical field verification — అవసరాన్ని బట్టి. మొత్తం 2-3 రోజులు కేటాయించడం మంచిది. లక్షల రూపాయల investment కి 2-3 రోజులు invest చేయడం చాలా worth it.

చిన్న agricultural land, familiar గ్రామంలో కొంటే basic checks మీరే చేయవచ్చు. కానీ పెద్ద amount, urban land, అపరిచిత ప్రాంతంలో లేదా complex situations లో — experienced land advocate తో proceed చేయడం మంచిది. Advocate fee వేలల్లో ఉంటుంది కానీ లక్షలు పోగొట్టుకోకుండా కాపాడుతుంది.

EC లో registered transactions మాత్రమే కనిపిస్తాయి. Unregistered deals ఉండవచ్చు. Adangal మరియు 1B Record కూడా cross-check చేసి, Dispute Table చూసిన తర్వాతే confident గా కొనండి.